హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు: సైబరాబాద్ పోలీసుల హెచ్చరిక
- చలానాతో సరిపెట్టబోము
- తొలిసారి పట్టుబడితే మూడు నెలలు లైసెన్సు రద్దు
- రెండోసారి పట్టుబడితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
దీంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తామని హెచ్చరించారు. ఇకపై హెల్మెట్ ధరించకుండా బైక్ నడుపుతూ పట్టుబడితే చలానాతో సరిపెట్టబోమని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని చెప్పారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ తొలిసారి పట్టుబడితే మూడు నెలలు, రెండోసారి పట్టుబడితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి సంబంధిత ఆర్టీవో అధికారులకు సిఫారసు చేస్తామని తెలిపారు. దీనిపై ఓ వీడియోనూ విడుదల చేశారు.