బెంగాల్ కార్మికశాఖ మంత్రి జాకీర్ హుస్సేన్‌పై బాంబుదాడి.. పరిస్థితి విషమం

West Bengal Minister injured in bomb attack in Murshidabad
  • కోల్‌కతా వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌లో మంత్రి ఎదురుచూపు
  • బాంబులు విసిరిన గుర్తు తెలియని వ్యక్తులు
  • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
పశ్చిమ బెంగాల్ కార్మిక శాఖ మంత్రి జాకీర్‌ హుస్సేన్‌పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. గత రాత్రి 10 గంటల సమయంలో కోల్‌కతా వెళ్లేందుకు ముర్షిదాబాద్ జిల్లాలోని నిమ్తితా రైల్వే స్టేషన్‌లో మంత్రి వేచి చూస్తున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆయనపై బాంబులు విసిరారు.

బాంబు పేలుళ్లతో రైల్వే స్టేషన్ దద్దరిల్లింది. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మంత్రిని జంగీపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మంత్రితోపాటు మరో ఇద్దరు గాయపడ్డారు. మంత్రి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
West Bengal
Labour Minister
Murshidabad
Jakir Hossain

More Telugu News