Team India: చివరి రెండు టెస్టులకు టీమిండియా జట్టు ప్రకటన.. వివరాలు!

TeamIndia for last Two Tests against England announced
షార్ట్స్‌లో చూడండి
ఇంగ్లండ్ తో జరగనున్న చివరి రెండు టెస్టుల్లో ఆడే జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొలి రెండు టెస్టులు ఆడిన జట్టునే చివరి రెండు టెస్టులకు కొనసాగించింది. కేవలం ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ ను మాత్రమే జట్టు నుంచి తప్పించారు. విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనేందుకు శార్దూల్ ను జట్టు నుంచి విడుదల చేశారు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో పేసర్ ఉమేశ్ యాదవ్ జట్టులోకి వస్తాడని... అయితే, ఉమేశ్ కి మెడికల్ టీమ్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.

చివరి రెండు టెస్టులకు టీమిండియా జట్టు ఇదే:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుభ్ మన్ గిల్, చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్సర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇశాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.

స్టాండ్ బై ప్లేయర్లు అభిమన్యు ఈశ్వరన్, షహబాజ్ నదీమ్, ప్రియాంక్ పాంచాల్ లను కూడా విజయ్ హజారే ట్రోఫీ కోసం విడుదల చేశారు. చివరి టెస్టులకు నెట్ బౌలర్లుగా అంకిత్ రాజ్ పుత్, అవీశ్ ఖాన్, సందీప్ వారియర్, కృష్ణప్ప గౌతమ్, సౌరవ్ కుమార్ లను ఎంపిక చేశారు. స్టాండ్ బై ప్లేయర్లుగా కేఎస్ భరత్, రాహుల్ చాహర్ లను తీసుకున్నారు.

చివరి రెండు టెస్టులు అహ్మదాబాద్ లోనే జరగనున్నాయి. నాలుగు టెస్టుల సిరీస్ ఇప్పటికైతే 1-1తో సమంగా ఉంది. తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలుపొందగా, రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది.
Go Back to Shorts
Team India
England
Test Squad

More Telugu News