మధ్య తరగతికి తక్కువ ధరకే ఇళ్లు ఇవ్వడంపై సీఎం జగన్ సమీక్ష
- అధికారులతో సీఎం జగన్ సమావేశం
- పట్టణ గృహ నిర్మాణ అంశంపై చర్చ
- అధికారుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్న సీఎం
- అర్హులకు క్లియర్ టైటిళ్లతో ఫ్లాట్లు ఇవ్వాలని ఆదేశాలు
- రింగ్ రోడ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్పష్టీకరణ
తక్కువ ధరకే స్థలాలు, ఇళ్లు ఇవ్వడం నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణానికి భూములు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. పట్టణాల చుట్టూ రింగ్ రోడ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. రింగ్ రోడ్ల చుట్టూ స్మార్ట్ టౌన్ లే అవుట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. భూములిచ్చేవారికి, ప్రభుత్వానికి లబ్ది కలిగేలా రింగ్ రోడ్లు ఉండాలని వివరించారు. ఈ క్రమంలో తొలి విడతగా 12 పట్టణాల్లో ఈ తరహాలో 18 లేఅవుట్లు నిర్మించాలన్నది తమ నిర్ణయం అని సీఎం జగన్ వెల్లడించారు.