మా నాన్న రెండు సార్లు సీఎం అయినా డబ్బుకు ఆశ పడలేదు.. జగన్ కోట్లు సంపాదించాడు: కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

  • వైసీపీ బెదిరింపులకు భయపడం
  • ప్రజాసేవే మా లక్ష్యం
  • ప్రజలు బాగుండటమే మాకు కావాలి
ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కోట్ల విజయభాస్కరరెడ్డి రెండు సార్లు సీఎంగా పని చేశారని, తాను ఒకసారి కేంద్ర మంత్రిగా పని చేశానని... అయితే తాను ఏనాడూ డబ్బుకు ఆశ పడలేదని అన్నారు. అదే జగన్ ఆయన తండ్రి వైయస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించాడని విమర్శించారు. కర్నూలు జిల్లా కోడుమూరు పంచాయతీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని కోట్ల అన్నారు. టీడీపీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని చెప్పారు. ప్రజలు బాగుండటమే తమకు కావాలని అన్నారు. ప్రజాసేవే తమ లక్ష్యమని చెప్పారు. పేకాట, బెట్టింగులను ప్రోత్సహిస్తున్న వైసీపీ నేతలను అరెస్ట్ చేసే దమ్ము పోలీసులకు ఉందా? అని ప్రశ్నించారు.


More Telugu News

Kotla Surya Prakash Reddy Telugudesam Jagan YSRCP