తాము అధికారంలోకి వస్తే సాగు చట్టాలను రద్దు చేస్తామన్న ప్రియాంక.. కొత్త నాటకం ప్రారంభించారన్న యూపీ మంత్రి
- సాగు చట్టాలు రాక్షసమైనవి
- రైతులను మోదీ, బీజేపీ నేతలు అవమానిస్తున్నారు
- తమ లక్ష్యం అధికార మార్పు కాదన్న రాకేశ్ తికాయత్
కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలు రాక్షసమైనవని, తాము అధికారంలోకి వస్తే వాటిని రద్దు చేస్తామని అన్నారు. కొత్త చట్టాలపై ఆందోళన చేస్తున్న రైతులను ప్రధాని మోదీ, బీజేపీ నేతలు అవమానిస్తున్నారని ఆరోపించారు. ప్రియాంక హామీపై యూపీ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా స్పందించారు. రైతుల పేరిట కాంగ్రెస్ కొత్త నాటకానికి తెరలేపిందని మండిపడ్డారు. మరోవైపు, రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ కూడా స్పందించారు. తాము సమస్యల పరిష్కారం కోసమే పోరాడుతున్నామని, అధికార మార్పు కోసం కాదని అన్నారు.