ఏపీ కరోనా అప్ డేట్: కొత్తగా 75 మందికి పాజిటివ్
- గత 24 గంటల్లో 34,864 కరోనా టెస్టులు
- అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 16 కేసులు
- ప్రకాశం జిల్లాలో ఒక కేసు నమోదు
- విశాఖ జిల్లాలో ఒకరి మృతి
- యాక్టివ్ కేసుల సంఖ్య 1,012
అదే సమయంలో 133 మంది కరోనా నుంచి కోలుకోగా, విశాఖపట్నంలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,88,350 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,80,179 మంది కరోనా ప్రభావం నుంచి విముక్తులయ్యారు. ఇంకా 1,012 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 7,159కి చేరింది.