డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ జబర్దస్త్ కమెడియన్!
- నిన్న రాత్రి ఘటన
- పోలీసులకు చిక్కిన తన్మయి, పలువురు ఈవెంట్ మేనేజర్లు
- వాహనాల స్వాధీనం
నిన్న రాత్రి జూబ్లీ హిల్స్ లో ఈవెంట్ ఆర్గనైజర్లతో కలిసి ఆయన మద్యం తాగి వాహనం నడుపుతూ, పోలీసులకు దొరికిపోయారు. కాగా, గత రాత్రి చేసిన డ్రంకెన్ డ్రైవుల్లో చాలా మంది పోలీసులకు చిక్కారు. ఈ తనిఖీల్లో ఐదు కార్లు, రెండు ఆటోలతో పాటు 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారందరిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. డ్రంకెన్ డ్రైవ్ చేసిన వారికి కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు.