ఇకపై హైదరాబాద్ నుంచి నేరుగా మాల్దీవులకు విమానం... గోఎయిర్ కొత్త సర్వీసు
- బడ్జెట్ ధరల ఎయిర్ లైన్స్ గా గుర్తింపు తెచ్చుకున్న గోఎయిర్
- మాలే నగరానికి తొలి డైరెక్ట్ సర్వీసు
- వారానికి నాలుగు రోజుల పాటు సర్వీసులు
- ఈ రూట్లో ఎయిర్ బస్ విమానాన్ని వినియోగించాలని నిర్ణయం
గోఎయిర్ ఈ రూట్లో తన ఎయిర్ బస్ ఏ320 నియో విమానాన్ని నడపనుంది. ఉదయం 11.30 గంటలకు హైదరాబాదులో బయల్దేరే ఈ విమానం మాలే కాలమానం ప్రకారం 1.30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో స్థానిక కాలమానం ప్రకారం 2.30 గంటలకు మాలేలో బయల్దేరి 5.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.