చెన్నై టెస్టులో నత్త నడకన సాగుతున్న ఇంగ్లండ్ బ్యాటింగ్
- చెన్నైలో భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- 37 ఓవర్లలో 81/2
- చెరో వికెట్ తీసిన అశ్విన్, బుమ్రా
అంతకుముందు ఓపెనర్ రోరీ బర్న్స్ (60 బంతుల్లో 33) అశ్విన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన డేనియల్ లారెన్స్ కేవలం 5 బంతులాడి సున్నా పరుగుల వద్ద అవుటయ్యాడు. ఈ వికెట్ బుమ్రాకు దక్కింది. ఈ పిచ్ నుంచి బౌలర్లకు పెద్దగా సహకారం లేకపోయినా, ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ మితిమీరిన ఆత్మరక్షణ ధోరణితో ఆడుతున్నారు. కాగా, మ్యాచ్ గడిచే కొద్దీ చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలున్నాయని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.