నాతో సినిమా చేయమని ఒక్క రత్నం గారిని మాత్రమే అడిగాను: పవన్ కల్యాణ్
- ఏఎం రత్నంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్
- రత్నంతో తనకు ఎప్పటినుంచో పరిచయం ఉందని వెల్లడి
- రత్నం మినహా మరే నిర్మాతను సినిమా అడగలేదని వివరణ
- తనకు ఖుషీ వంటి హిట్ ను ఇచ్చారన్న పవన్
తనకు నెల్లూరులో ఓ స్నేహితుడు ఉన్నాడని, అతను ఏఎం రత్నంకు బంధువు అని తెలిపారు. ఆ విధంగా తన స్నేహితుడి ద్వారా రత్నం పరిచయం అయ్యారని, చెన్నైలో తరచుగా కలుస్తుండేవాడ్నని వివరించారు. అయితే, తనతో సినిమా చేయమని ఒక్క రత్నం గారిని మాత్రమే అడిగానని, మరే నిర్మాతను ఆ విధంగా అడగలేదని పవన్ వెల్లడించారు. తన కెరీర్ లో చిరస్మరణీయ చిత్రం ఖుషీ ఏఎం రత్నం బ్యానర్ నుంచే వచ్చిందని చెప్పారు. మున్ముందు ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.