MS Raju: కాబోయే కోడలిని కొనియాడిన నిర్మాత ఎంఎస్ రాజు

MS Raju opines about his daughter in law
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు కుటుంబంలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ ఈ నెల 13న పెళ్లి చేసుకోబోతున్నాడు. దీనిపై నిర్మాత ఎంఎస్ రాజు స్పందిస్తూ, తన కుమారుడి వివాహ వేడుకలు మూడ్రోజుల పాటు నిర్వహిస్తామని చెప్పారు. హైదరాబాదు నగర శివార్లలోని తమ ఫాంహౌస్ లో ఈ పెళ్లి జరుగుతుందని, తెలుగు సంప్రదాయాలను పాటిస్తామని తెలిపారు.

ఇక తమ కాబోయే కోడలు గురించి వెల్లడించారు. దీపికతో తన కుమారుడి వివాహం జరగబోతోందని పేర్కొన్నారు. దీపిక అమెరికాలోని డల్లాస్ లో రీసెర్చ్ సైంటిస్ట్ గా పనిచేస్తోందని వివరించారు. దీపిక మంచి మనసున్న అమ్మాయి అని, ఎంతో అణకువ కలిగిన అమ్మాయి అని కొనియాడారు. దీపిక వంటి మంచి అమ్మాయి తమ కుటుంబంలోకి వస్తుండడం సంతోషం కలిగిస్తోందని అన్నారు. కాగా, ఈ పెళ్లికి పరిమిత సంఖ్యలోనే బంధుమిత్రులను ఆహ్వానిస్తున్నామని ఎంఎస్ రాజు తెలిపారు.

తూనీగ తూనీగ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుమంత్ అశ్విన్ కేరింత, హ్యాపీ వెడ్డింగ్, ఫ్యాషన్ డిజైనర్ చిత్రాల్లో నటించారు.
Go Back to Shorts
MS Raju
Sumanth Ashwin
Deepika
Daughter-In-Law
Wedding
Tollywood

More Telugu News