Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సైబరాబాద్ పోలీసు క్రీడల ముగింపు వేడుకల్లో రామ్ చరణ్ సందడి

Ram Charan attends Cyberabad annual police meet closing ceremony
  • పరేడ్ గ్రౌండ్ లో పోలీసు క్రీడల నిర్వహణ
  • ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా రామ్ చరణ్
  • స్వాగతం పలికిన సజ్జనార్
  • ఫైనల్స్ ముంగిట తుపాకీ పేల్చిన రామ్ చరణ్
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఓ వైపు ఆర్ఆర్ఆర్, మరోవైపు ఆచార్య చిత్రాలతో ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతటి బిజీ షెడ్యూల్ లోనూ రామ్ చరణ్ సైబరాబాద్ పోలీసుల కోసం కొద్ది సమయం కేటాయించారు. గచ్చిబౌలి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న సైబరాబాద్ పోలీసు వార్షిక క్రీడల ముగింపు వేడుకలకు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

బెంజ్ కారులో వచ్చిన చరణ్ ను పోలీసు అశ్వికదళం క్రీడోత్సవాల వేదిక వద్దకు తోడ్కొని వచ్చింది. సైబరాబాద్ పోలీస్ కమిషర్ సజ్జనార్ స్వయంగా వచ్చి స్వాగతం పలికారు. ఆపై రామ్ చరణ్ కు ఓ మొక్కను బహూకరించారు. క్రీడాంశాల్లో ఫైనల్స్ సందర్భంగా రామ్ చరణ్ తుపాకీ పేల్చడం విశేషం. ఈ క్రీడోత్సవాలకు రామ్ చరణ్ రాకతో మరింత ఉత్సాహం నెలకొంది.
Ramcharan
Annual Police Meet
Cyberabad
Closing Ceremony
Hyderabad

More Telugu News