అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన నిమ్మగడ్డ
- గొల్లలగుంట సర్పంచ్ అభ్యర్థి ఇంటికి వెళ్లిన నిమ్మగడ్డ
- పుష్పవతిని పరామర్శించిన నిమ్మగడ్డ రమేశ్
- ఘటనను మానవతా ధృక్పథంతో చూడాలని వ్యాఖ్య
అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది రాజకీయాలు, తప్పులు ఎంచే సమయం కాదని అన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడరాదని, కొన్ని విషయాలను స్థానిక అంశాలు, మానవతా దృక్ఫథంతో చూడాలని చెప్పారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా శిక్ష అనుభవిస్తారని అన్నారు. జిల్లా ఎస్పీ ఘటనా స్థలిలోనే ఉండి, వ్యక్తిగతంగా కేసును పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. నిజాలు ఎప్పటికైనా వెలుగులోకి వస్తాయని, అప్పటి వరకు అందరూ సహనంతో ఉండాలని సూచించారు. ఓ వార్తాపత్రికలో తాను ఈ ఘటనకు సంబంధించిన వార్తను చదివానని తెలిపారు. ఘటనకు గల కారణాలను పరిశీలిస్తానని చెప్పారు.