ఆధార్ కార్డుతో 16 రకాల సేవలు... లెర్నింగ్ లైసెన్స్ ఆన్ లైన్ లోనే!
- రవాణా శాఖ ద్వారా అందే సేవలు ఆన్ లైన్ లో
- ప్రస్తుతం ముసాయిదా రూపంలో బిల్లు
- మార్చిలోగా అమలులోకి వచ్చే అవకాశం
కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రవాణా శాఖలో మార్పులు చేసేలా కొత్త నిర్ణయాలు వెలువడనున్నాయని ఆయన అన్నారు. రవాణా కార్యాలయాల్లో ఆన్ లైన్ సేవల కోసం ఇప్పటికే సమాచార సాంకేతిక శాఖ ఆమోదం తెలిపిందన్నారు. ఈ ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి వస్తే, రవాణా శాఖ నుంచి అందే 16 రకాల సేవలను పొందవచ్చని అధికారులు వెల్లడించారు. వెహికల్ టెంపరరీ రిజిస్ట్రేషన్, లెర్నింగ్ లైసెన్స్ ను కూడా ఇంటి నుంచే తీసుకోవచ్చని, ఈ విషయంలో రాష్ట్రాలకు ఏమైనా అభ్యంతరాలుంటే రెండు వారాల్లో తెలియజేయాలని కోరామని అన్నారు.
ప్రస్తుతం ముసాయిదా రూపంలో ఉన్న ఈ కొత్త నిర్ణయాలు మార్చిలోగా అమలులోకి వస్తాయని సమాచారం. లెర్నింగ్ లైసెన్స్, దాని రెన్యువల్, డూప్లికేట్ డీఎల్, అడ్రస్ చేంజ్, వాహన రిజిస్ట్రేషన్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్, రిజిస్ట్రేషన్ కోసం ఎన్ఓసీ, వాహన బదిలీ, డూప్లికేట్ ఆర్సీ తదితర సేవలను ఆన్ లైన్ లో పొందవచ్చు.