రాహుల్ గాంధీని తక్షణమే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించండి... ఢిల్లీ రాష్ట్ర కాంగ్రెస్ తీర్మానం
- కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జూన్ లో ఎన్నికలు
- ఇటీవలే ప్రకటించిన ఏఐసీసీ
- రాహులే అధ్యక్షుడంటూ ఢిల్లీ కాంగ్రెస్ స్పష్టీకరణ
- రాహల్ తోనే పునర్ వైభవం వస్తుందన్ని వెల్లడి
ఢిల్లీ కాంగ్రెస్ తాజాగా చేసిన తీర్మానంతో దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ విభాగాలు కూడా ఇదే రకంగా తీర్మానాలు చేయొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఏఐసీసీ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నికలకు తేదీలు ప్రకటించడం తెలిసిందే. జూన్ లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు చేపట్టాలని ఇటీవల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.