అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన మోదీ ఇప్పటివరకు చేసిందేమీ లేదు: మహమూద్ అలీ
- బీజేపీ నుంచి పలువురు టీఆర్ఎస్ లో చేరిక
- మహమూద్ అలీ సమక్షంలో పార్టీ చేరిన నేతలు
- బీజేపీ మత రాజకీయాలకు పాల్పడుతోందన్న అలీ
- సమాజాన్ని విభజిస్తోందని ఆరోపణ
రాష్ట్రంలో మరే నాయకుడు చెయ్యని విధంగా పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా, ఆ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మహమూద్ అలీ అన్నారు. రైతులకు ఉపయుక్తంగా ఉచిత విద్యుత్, బీమా, రైతు బంధు, సాగునీటి పథకాలతో బంజరు భూములను సస్యశ్యామలం చేస్తున్నారని వెల్లడించారు.