వరుసగా రెండో రోజు కూడా ఏపీలో కరోనా మరణాలు నిల్

  • గత 24 గంటల్లో 42,809 కరోనా పరీక్షలు
  • 125 మందికి పాజిటివ్
  • అత్యధికంగా కృష్ణా జిల్లాలో 26 కొత్త కేసులు
  • అత్యల్పంగా ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కొక్క కేసు
  • యాక్టివ్ కేసుల సంఖ్య 1,308
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి, ప్రభావం బాగా అదుపులోకి వచ్చినట్టే కనిపిస్తోంది. వరుసగా రెండో రోజు ఏపీలో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7,152గా నమోదైంది.

గత 24 గంటల్లో ఏపీలో 42,809 కరోనా పరీక్షలు నిర్వహించగా 125 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 26 కొత్త కేసులు గుర్తించారు. గుంటూరు జిల్లాలో 19, విశాఖ జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 1, కడప జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 2 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 175 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,87,591 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,79,131 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,308 మందికి చికిత్స జరుగుతోంది.


More Telugu News

Corona Virus Deaths Andhra Pradesh Positive Cases Active Cases