టీజర్ వెంటే మరో గుడ్ న్యూస్.... మే 13న 'ఆచార్య' గ్రాండ్ రిలీజ్
- ఈ సాయంత్రం 'ఆచార్య' నుంచి టీజర్ రిలీజ్
- ఆ వెంటనే రిలీజ్ డేట్ వెల్లడి
- వేసవిలో రానున్న 'ఆచార్య'
- టీజర్ కు విశేష స్పందన
- 'ధర్మస్థలి' కాన్సెప్ట్ పై అధికమవుతున్న ఆసక్తి
కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సందేశాత్మక కమర్షియల్ చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఇటీవల వచ్చిన చిరంజీవి ఫస్ట్ లుక్ 'ఆచార్య' సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇందులో 'ధర్మస్థలి' కాన్సెప్ట్ పై అందరిలోనూ ఆసక్తి అధికమవుతోంది. 'ఆచార్య' చిత్రాన్ని కొణిదెల ప్రొ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.