రిలయన్స్ జియో మరో ఘనత.. అంతర్జాతీయంగా ఐదో ర్యాంకు!
- టెలికం రంగంలోకి అడుగుపెట్టిన నాలుగేళ్లలోనే అగ్రస్థానం
- ‘గ్లోబల్ 500’ జాబితాను విడుదల చేసిన బ్రాండ్ ఫైనాన్స్
- జియోపై ప్రశంసలు
40 కోట్ల మంది వినియోగదారులతో జియో దేశంలో అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్‌గా, ప్రపంచంలో మూడో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా నిలిచిందని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది. ప్రతిష్ఠ, మౌత్ పబ్లిసిటీ, కొత్తదనం, సేవలు, డబ్బుకు తగ్గ విలువ వంటి అంశాల్లో జియో మేటిగా నిలిచిందని ప్రశంసించింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ కూడా ఇదేనని పేర్కొంది. 50 శాతం వృద్ధితో తన బ్రాండ్ విలువను 480 కోట్ల డాలర్లకు చేర్చుకుందని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది.