పీఆర్సీ నివేదిక ఉద్యోగుల ఆంక్షలపై నిప్పులు పోసింది: విజయశాంతి
- విమర్శల పాలవుతున్న తెలంగాణ పీఆర్సీ నివేదిక
- ప్రభుత్వంపై విజయశాంతి విమర్శలు
- ఉద్యోగులు రోదించే పరిస్థితి ఉందన్న విజయశాంతి
- కమీషన్ రాదని తెలిస్తే సీఎం ఏ పనీ చేయరని ఎద్దేవా
ఉద్యోగులు 65 శాతం ఫిట్ మెంట్ ఆశిస్తే... పీఆర్సీ సిఫారసు అందులో సగం కూడా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు కమీషన్ రాదని తెలిస్తే ఈ ముఖ్యమంత్రి ఫిట్ మెంట్ సహా మరే ఖర్చును కూడా అంగీకరించరని విజయశాంతి ఎద్దేవా చేశారు. కమీషన్లు దొరికే మోసపు ప్రాజెక్టులకు మాత్రం ఏంతైనా బేఫికర్... వేల, లక్షల కోట్ల రూపాయల అప్పులకైనా బరాబర్ తయారవుతారని వ్యంగ్యం ప్రదర్శించారు.