పవర్ స్టార్ చిత్రంలో నిధి అగర్వాల్?
- 'ఇస్మార్ట్ శంకర్'తో నిధికి తొలి విజయం
- క్రిష్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం
- ఇటీవల షూటింగులో పాల్గొన్న నిధి
- మరో కథానాయికగా జాక్వెలిన్
తాజాగా ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించే బిగ్ ఆఫర్ ను అందుకున్నట్టు వార్తలొస్తున్నాయి. క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా ఓ పిరీడ్ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే హైదరాబాదులో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగు కూడా మొదలైంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఓ కథానాయికగా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈమె ఈ చిత్రం షూటింగులో కూడా పాల్గొందని అంటున్నారు. ఈ సినిమాలో మరో కథానాయికగా బాలీవుడ్ తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తుందని సమాచారం.