పది రెట్ల వేగం.. సెకన్లలో సినిమా డౌన్​ లోడ్​.. వచ్చేసింది ఎయిర్​ టెల్​ 5జీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పది రెట్ల వేగం.. సెకన్లలో సినిమా డౌన్​ లోడ్​.. వచ్చేసింది ఎయిర్​ టెల్​ 5జీ!

Airtel 5G Demonstration Goes Live in Hyderabad Ahead of Commercial Rollout
  • ఒప్పో ఫోన్లతో 5జీ పనితీరును చూపించిన కంపెనీ
  • ఎరిక్సన్ తో కలిసి స్పెక్ట్రమ్ అభివృద్ధి
  • కేంద్రం అనుమతిస్తే వెంటనే తీసుకొస్తామని ప్రకటన
మన దేశంలో 5జీకి శరవేగంగా అడుగులు పడిపోతున్నాయి. ఇప్పటికే రిలయన్స్ జియో 5జీని తీసుకొచ్చేసింది. ఇప్పుడు దానికి పోటీగా ఎయిర్ టెల్ కూడా 5జీ సర్వీసులు మొదలుపెట్టేసింది. దానికి సంబంధించి హైదరాబాద్ లో గురువారం వాణిజ్య నెట్ వర్క్ లపై డెమో కూడా ఇచ్చింది. నాన్ స్టాండ్ అలోన్ (ఎన్ఎస్ఏ) నెట్ వర్క్ టెక్నాలజీ ద్వారా 1800 మెగాహెర్జ్ బ్యాండ్ లో 5జీ, 4జీ రెండింటినీ సమాంతరంగా పనిచేయించి చూపించింది.

ప్రస్తుతమున్న నెట్ వర్క్ లతో పోలిస్తే ఎయిర్ టెల్ 5జీ నెట్ వర్క్ 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఓ సినిమాను కేవలం కొన్ని క్షణాల్లోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చని అంటున్నారు. తమకు పరికరాలను అందించే ఎరిక్సన్ తో కలిసి కొత్త 5జీని ఆవిష్కరించినట్టు సంస్థ తెలిపింది. 1800 మెగాహెర్జ్, 2100, 2300 మెగాహెర్జ్ ల తరంగదైర్ఘ్యాల వద్ద ఇది పనిచేస్తుందని చెప్పింది. ఇటు సబ్ గిగాహెర్జ్ బ్యాండ్స్ అయిన 800 మెగా హెర్జ్, 900 మెగా హెర్జ్ వద్ద కూడా మంచి సేవలు అందుతాయని తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే కొన్ని నెలల్లోనే దానిని అందుబాటులోకి తెస్తామని ఎయిర్ టెల్ ప్రకటించింది. ఇప్పుడున్న స్పెక్ట్రమ్ పరిధిలోనే తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది. కొన్ని నెలల్లో తెస్తామని చెప్పినా.. కచ్చితంగా ఎప్పుడు తీసుకొస్తారనే విషయాన్ని మాత్రం సంస్థ చెప్పలేదు.

ప్రభుత్వం ఓకే చెప్పిన వెంటనే 5జీని తెస్తామని, దానికి సంబంధించిన అన్ని స్పెక్ట్రమ్ బ్యాండ్స్ సరిపోనూ ఉన్నాయని భారతీ ఎయిర్ టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ చెప్పారు. కాగా, 5జీ డెమాన్ స్ట్రేషన్ కోసం ఒప్పో రెనో 5 ప్రో, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 ప్రో స్మార్ట్ ఫోన్లను ఎయిర్ టెల్ వినియోగించింది.
Airtel
5G
Hyderabad

More Telugu News