ఉద్ధవ్ థాకరే డిమాండుకు కర్ణాటక డిప్యూటీ సీఎం కౌంటర్
- కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదాలు
- మరాఠీ మాట్లాడే ప్రాంతాలను కలిపేసుకుంటామన్న థాకరే
- ముంబయిపై తమకూ హక్కుందన్న లక్ష్మణ్ సవాడి
- ముంబయిని యూటీ చేయాలని డిమాండ్
ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడి మండిపడ్డారు. ముంబయినే కర్ణాటకలో కలిపేయాలని, అది వీలు కాకపోతే ముంబయిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని లక్ష్మణ్ సవాడి గట్టిగా బదులిచ్చారు. ఆ మేరకు కేంద్రాన్ని కోరారు. బెళగావి ప్రాంతానికి చెందిన తాము గతంలో ముంబయి పరిధిలోని వారమేనని, అందుకే ముంబయిపై తమకు కూడా హక్కుందని భావిస్తున్నామని సవాడి స్పష్టం చేశారు. సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నామని చెప్పారు.