మ‌ద్యం మత్తులో అమ్మాయిల ఇంటికెళ్లి రెచ్చిపోయిన 'కోయిలమ్మ' సీరియ‌ల్ హీరో.. వీడియో ఇదిగో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మ‌ద్యం మత్తులో అమ్మాయిల ఇంటికెళ్లి రెచ్చిపోయిన 'కోయిలమ్మ' సీరియ‌ల్ హీరో.. వీడియో ఇదిగో

samir creates ruckus
  • హైద‌రాబాద్ శివారులోని మ‌ణికొండ‌లో ఘ‌ట‌న‌
  • అసభ్య పదజాలంతో ఇద్ద‌రు యువ‌తుల‌ను దూషించిన వైనం
  • అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలన్నందుకే ఘ‌ట‌న‌?
  • రాయదుర్గం పోలీసులకు యువ‌తుల‌ ఫిర్యాదు
బాగా తాగి అమ్మాయిల ఇంటికి వెళ్లి గొడ‌వ పెట్టుకున్నాడు బుల్లితెర నటుడు సమీర్ అలియాస్ అమర్. గ‌త రాత్రి 9 గంటలకు హైద‌రాబాద్ శివారులోని మ‌ణికొండ‌లో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఆయ‌న అసభ్య పదజాలంతో  యువ‌తుల‌ను దూషించాడు. అత‌డికి ఓ యువ‌తి వార్నింగ్ ఇవ్వడం కూడా ఈ వీడియోలో చూడొచ్చు. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలన్నందుకే అత‌డు ఇలా ప్ర‌వ‌ర్తించాడ‌ని  బాధితులు అంటున్నారు.

సమీర్‌తో పాటు మరో నలుగురు దాడికి పాల్పడ్డారంటూ ఇద్ద‌రు యువ‌తులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో కేసు నమోదు చేశారు. స‌మీర్ త‌మ‌కు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంద‌ని ఆ మ‌హిళ‌లు వివ‌రించారు.

అప్పు ఇచ్చి అత‌డితో తిట్టు తింటున్నామ‌ని, సమీర్‌ నుంచి తమకు ప్రాణహాని కూడా ఉందని ఆ యువ‌తులు చెప్పారు. స‌మీర్ మాత్రం ఈ ఘ‌ట‌న‌పై మ‌రో వాద‌న వినిపించిన‌ట్లు తెలిసింది. తాను ఎవ‌రికీ సంజాయిషీ ఇచ్చుకోవ‌ల‌సిన అవ‌స‌రం లేదని, పోలీసుల‌కు నిజాల‌ను చెబుతాన‌ని స‌మీర్ అన్నాడు.

కాగా, శ్రీవిద్య, అపర్ణ‌లు కొన్ని రోజులుగా మ‌ణికొండ‌లో బొటిక్ వ్యాపారం చేసుకుంటుండ‌గా వారి ద‌గ్గ‌ర నుండి స‌మీర్ ఐదు లక్షల నగదు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. స‌మీర్  కోయిలమ్మ  అనే సీరియ‌ల్‌లో హీరోగా న‌టిస్తున్నాడు.

        
Crime News
Hyderabad
Viral Videos

More Telugu News