తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ!

Heavy Rush in Tirumala
  • దాదాపు 50 వేల మందికి దర్శనం
  • ఈ ఉదయం దర్శనం కోసం వేచి చూస్తున్న 12 వేల మంది
  • టీకా ఇవ్వాలంటున్న టీటీడీ ఉద్యోగులు
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. నిన్న ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి దాదాపు 50 వేల మంది భక్తులు వచ్చారు. వీరందరికీ దర్శనాలు కల్పించామని, ఇంకా సుమారు 12 వేల మంది స్వామి దర్శనానికి వేచి చూస్తున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు.

కల్యాణోత్సవాన్ని ఆన్ లైన్ లో చేయించుకున్న భక్తులు, వారాంతంలో కాకుండా మిగతా రోజుల్లో రావాలని అధికారులు అభ్యర్థించారు.  ఇక నిన్న ఆదివారం నాడు హుండీ ద్వారా రూ. 3.20 కోట్ల ఆదాయం లభించిందని అధికారులు పేర్కొన్నారు. కాగా, టీటీడీ అధికారులు, అందరు ఉద్యోగులకు టీకా ఇచ్చేంత వరకూ భక్తుల సంఖ్యను అదుపులోనే ఉంచాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Tirumala
Tirupati
TTD
Piligrims

More Telugu News