చిరుతపులి మాంసంతో కూర వండుకుని విందు చేసుకున్నారు!
- కేరళలో దారుణం
- పొలంలో ఉచ్చులు ఏర్పాటు చేసిన రైతు
- ఉచ్చులో చిక్కుకున్న చిరుత
- స్నేహితులతో కలిసి చిరుతను చంపిన రైతు
చిరుత మాంసం ఆరగించడమే కాదు, దాని చర్మం, గోళ్లు, పళ్లను కూడా విక్రయించేందుకు సిద్ధమయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు గతంలోనూ అనేక వన్యప్రాణులను వధించినట్టు అధికారులు గుర్తించారు.