రామాలయ నిర్మాణానికి కోట్లాది రూపాయల విరాళం ఇచ్చిన మైహోమ్, మేఘా ఇన్ఫ్రా!
- జూపల్లి రామేశ్వరరావు రూ. 5 కోట్లు
- మేఘా ఇంజినీరింగ్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి రూ. 6 కోట్లు
- అపర్ణ కన్స్ స్ట్రక్షన్స్ రూ. 2 కోట్లు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ముచ్చింతల్ లో ఉన్న త్రిదండి చినజీయర్ స్వామి సమక్షంలో మైహోమ్ గ్రూప్ డైరెక్టర్లు జూపల్లి రామ్ రావు, జూపల్లి శ్యామ్ రావు విరాళాన్ని ఇచ్చారు. ఆరెస్సెస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషి, ఆరెస్సెస్ నేత భాగయ్యకు చెక్కుల రూపంలో విరాళాలను అందజేశారు. ఫిబ్రవరి 27 వరకు విరాళాల సేకరణ కొనసాగనుంది. దేశ వ్యాప్తంగా ఐదు లక్షల గ్రామాల్లోని కోటి ఇళ్ల నుంచి విరాళాలను సేకరించనున్నట్టు రామ జన్మభూమి ట్రస్టు ప్రకటించింది.