త్వరలోనే బీజేపీలోకి సినీ నటి అర్చన.. సోము వీర్రాజుతో భేటీ
- బీజేపీకి పెరుగుతున్న సినీ గ్లామర్
- అర్చన బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రశంస
- మర్యాదపూర్వక భేటీయేనన్న బీజేపీ ఏపీ చీఫ్
ఇటీవల చెన్నైలో వాణీవిశ్వనాథ్, ప్రియారామన్‌ను కలిసిన బీజేపీ నేతలు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికలో ప్రచారం చేయాలని, భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మంచి పదవులు ఇస్తామని వారికి హామీ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా, అర్చనను సోము వీర్రాజు కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలోనే ఆమె కాషాయ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.