గుడివాడ ఎస్సై విజయ్ కుమార్ ఆత్మహత్య కేసులో ప్రియురాలి అరెస్ట్
- సోమవారం అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్న విజయ్‌కుమార్
- ప్రియురాలు సురేఖే కారణమంటూ ఎస్సై సోదరుడి ఫిర్యాదు
- విచారణ అనంతరం అరెస్ట్
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన పిల్లి విజయ్ కుమార్ కొన్ని నెలల క్రితం గుడివాడ టూటౌన్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. స్టేషన్‌కు సమీపంలోనే ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న ఆయనకు గతేడాది నవంబరులో వివాహమైంది. అయినప్పటికీ భార్యను తీసుకురాకుండా సురేఖతో కలిసి ఉంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విజయ్ కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన సోదరుడు విక్రమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా సురేఖను అరెస్ట్ చేశారు.