బిగ్ బాస్ తమిళ సీజన్ 4 విజేతగా నటుడు ఆరి అర్జున!
- నిన్న రాత్రి గ్రాండ్ ఫినాలే
- 105 రోజులు సాగిన బిగ్ బాస్
- అర్జున గెలుస్తాడని ముందే ఊహాగానాలు
అయితే, ఆది నుంచి అత్యధిక వీక్షకుల ఓట్లు ఆరి అర్జునకే వస్తుండటంతో, విజేతగా అతనే నిలుస్తాడని ముందు నుంచే ఊహాగానాలు ఉన్నాయి. హోస్ లోకి వెళ్లినప్పటి నుంచి ప్రేక్షకుల మన్ననలను అందుకుంటూ, దాదాపు మూడున్నర నెలల పాటు అర్జున అందరినీ అలరించాడని గ్రాండ్ ఫినాలేలో కమలహాసన్ వ్యాఖ్యానించారు. అర్జున నిజాయతీ, పోరాట పటిమ తనను ఆకర్షించాయని తెలిపారు.
కాగా, హౌస్ లో అత్యధిక సార్లు ఎలిమినేషన్ కు నామినేట్ అయిన కంటెస్టెంట్ గా ఉన్న అర్జున ప్రతిసారీ, ఫ్యాన్స్ ఓట్లతోనే గట్టెక్కుతూ రావడం గమనార్హం.