జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ఇంట్లో పోలీసుల తనిఖీలు అప్రజాస్వామికం: నాదెండ్ల మనోహర్
- తాడేపల్లిగూడెం పార్టీ ఇన్చార్జి నివాసంలో సోదాలు
- పోలీసుల చర్యను ఖండించిన నాదెండ్ల మనోహర్
- తనిఖీలపై పోలీసుల వివరణ ఇవ్వాలని డిమాండ్
- రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ ఆరోపణలు
- ఫ్యాక్షనిస్టు రాజకీయాలని విమర్శలు
రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు ఈ విధమైన చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఓ నాయకుడు ప్రజల కోసం ప్రశ్నిస్తుంటే అధికారపక్షం అప్రజాస్వామిక రీతిలో బెదిరింపులకు పాల్పడుతోందని వ్యాఖ్యానించారు. ఇది ముమ్మాటికీ ఫ్యాక్షన్ తరహా రాజకీయం అని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఈ ఘటనపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా చర్చించారని, ఈ అంశంలో బొలిశెట్టి శ్రీనివాస్ కు పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు.