రామ మందిర నిర్మాణానికి విరాళం ఇచ్చిన రాష్ట్రపతి
- రూ. 5,00,100 విరాళం ఇచ్చిన రామ్ నాథ్ కోవింద్
- రాష్ట్రపతిని కలిసిన స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్, అలోక్ కుమార్
- ఫిబ్రవరి 27 వరకు కొనసాగనున్న విరాళాల సేకరణ
విరాళాల సేకరణలో భాగంగా దేశ ప్రథమ పౌరుడు కోవింద్ ను రామ జన్మభూమి ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్, వీహెచ్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ తదితరులు కలిశారు. ఈ సందర్భంగా కోవింద్ తన విరాళం చెక్కును అందించారు. జనవరి 15 నుంచి విరాళాలను సేకరిస్తామని ట్రస్ట్ గతంలోనే ప్రకటించింది. ఫిబ్రవరి 27 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
దేశ వ్యాప్తంగా ఐదు లక్షల గ్రామాల్లోని కోటి ఇళ్ల నుంచి విరాళాలను సేకరించనున్నట్టు ట్రస్ట్ తెలిపింది. అంతేకాదు, పారదర్శకత ఉండేందుకు రూ. 20 వేలు అంతకంటే ఎక్కువ మొత్తం విరాళాలను చెక్ రూపంలో సేకరించనున్నట్టు పేర్కొంది. రూ. 2 వేల కంటే ఎక్కువ ఇచ్చిన వారికి రశీదు ఇవ్వాలని కూడా నిర్ణయించింది.