నేటి నుంచి ప్రారంభం కానున్న నూతన పార్లమెంట్ నిర్మాణ పనులు
- రూ. 971 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కేంద్రం
- అక్టోబరు 2022 నాటికి నిర్మాణం పూర్తి
- నిర్మాణ పనులను చేబడుతున్న టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్
గుజరాత్‌కు చెందిన హెచ్సీపీ సంస్థ పార్లమెంట్ భవన డిజైన్‌ను రూపొందించింది. నిర్మాణంలో ప్రత్యక్షంగా 2 వేల మంది, పరోక్షంగా 9 వేల మంది పాల్గొంటారు. అలాగే, 200 మందికిపైగా హస్తకళాకారులు భాగస్వామ్యం పంచుకోనున్నారు. ఒకేసారి 1,224 మంది ఎంపీలు కూర్చునే విధంగా హాలును నిర్మించనున్నారు.
రెండు అంతస్తుల్లో నిర్మిస్తున్న పార్లమెంటు భవనంలో రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు ప్రత్యేక కార్యాలయాలు, పార్లమెంటు సభ్యుల కోసం విశాలమైన లాంజ్, గ్రంథాలయం, బహుళ కమిటీల గదులు, భోజనశాలలు ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంటు, ఎంపీ కార్యాలయ భవనానికి మధ్య భూగర్భ మార్గం ఏర్పాటు చేస్తారు.