బ్రెజిల్‌కు మన కరోనా టీకా కొవాగ్జిన్!
- ‘ప్రిసిసా’తో భారత్ బయోటెక్ ఒప్పందం
- కొవాగ్జిన్ టీకాను తమకు సరఫరా చేయాలని కోరిన బ్రెజిల్ రాయబారి
- ‘అన్విసా’ నుంచి అనుమతి రాగానే సరఫరా
ఈ సందర్భంగా భారత్‌లోని బ్రెజిల్ రాయబారి ఆండ్రే ఆరాన్హ కోరె డా లాగో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డాక్టర్ కృష్ణతో మాట్లాడారు. తమ దేశానికి కూడా కొవాగ్జిన్ టీకాను సరఫరా చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో రెండు సంస్థల మధ్య టీకా సరఫరాకు సంబంధించి ఒప్పందం కుదిరింది. బ్రెజిల్ ఔషధ నియంత్రణ సంస్థ ‘అన్విసా’ నుంచి కొవాగ్జిన్‌కు అనుమతి లభించిన వెంటనే సరఫరా ప్రారంభమవుతుందని భారత్ బయోటెక్ పేర్కొంది.