వంట గ్యాస్ బుకింగులోనూ తత్కాల్ సేవలు.. ఇక చిటికెలో డెలివరీ!
- బుక్ చేసుకున్న 45 నిమిషాల్లోపే డెలివరీ
- ఫిబ్రవరి 1 నుంచి సేవల ప్రారంభానికి సన్నాహాలు
- ‘సులభతర జీవనం’ నినాదాన్ని మరింత మెరుగుపరిచే యోచన
ఇండేన్ బ్రాండ్ ద్వారా వంటగ్యాస్ సేవలను అందిస్తున్న ఐవోసీకి దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. తత్కాల్ సేవలను ప్రారంభించేందుకు తొలుత ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలోని ఒక నగరం, లేదంటే జిల్లాను ఎంపిక చేసుకోనున్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వ నినాదమైన ‘సులభతర జీవనం’లో భాగంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సేవలకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాల్సి ఉంది.