హైకోర్టు జడ్జీలలో ఇంతవరకు మా వాళ్లు 13 మందేనా?: వాపోయిన పీఎంకే నేత రాందాస్
- ఉద్దేశపూర్వకంగానే మా సామాజిక వర్గాన్ని దూరం పెడుతున్నారు
- రాష్ట్రంలోని అత్యధిక జనాభాలో వన్నియర్ కులం కూడా ఒకటి
- మా సామాజిక వర్గంలో వందలాదిమంది న్యాయవాదులు ఉన్నారు
వన్నియార్లలో వందలాదిమంది న్యాయవాదులు, న్యాయాధికారులు ఉన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఉద్దేశపూర్వకంగానే వారిని అధికారానికి దూరంగా ఉంచుతున్నారని ఆరోపించారు. వన్నియార్ సామాజిక వర్గానికే చెందిన కొందరు న్యాయమూర్తులు పీఎంకే, ఏఎఫ్ఎస్‌జేలకు సంబంధించిన కేసుల విచారణ నుంచి తప్పుకోవడం చూసి తాను ఆశ్చర్యపోయినట్టు డాక్టర్ రాందాస్ చెప్పారు.