ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కొనుగోలు కోసం సీరం సంస్థకు ఆర్డర్ ఇచ్చిన కేంద్రం
- భారత్ లో మరికొన్నిరోజుల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ
- కేంద్రం నుంచి ఆర్డర్ వచ్చిందని సీరం నిర్ధారణ
- కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను సరఫరా కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు
- పుణే నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా
అటు, వ్యాక్సిన్ పంపిణీకి అట్టే సమయం లేకపోవడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కొవిషీల్డ్ టీకాను అధికారులు సరఫరా కేంద్రాలకు తరలిస్తున్నారు. పుణేలోని సీరం సంస్థ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వ్యాక్సిన్ల రవాణా ప్రారంభించారు. ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను పుణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారీ ఎత్తున ఉత్పత్తి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.