కేసీఆర్ వల్లే తెలంగాణలో బీజేపీ బలపడింది: వీహెచ్
- కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు
- లేకపోతే బీజేపీని కాంగ్రెస్ అడ్డుకునేది
- సోనియాగాంధీని కూడా కేసీఆర్ మోసం చేశారు
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ బలపడటానికి కేసీఆరే కారణమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకుని కేసీఆర్ తప్పు చేశారని అన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకోకపోతే తమ పార్టీ ఇప్పటికీ బలంగా ఉండేదని... బీజేపీ ఎదగకుండా అడ్డుకునేదని చెప్పారు. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని చెప్పి సోనియాగాంధీని కూడా కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. ఇప్పుడు బీజేపీ కూడా ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటోందని అన్నారు. బీజేపీలో చేరితే పాపం పరిహారమవుతుందని ఆ పార్టీ నేతలు చెప్పడం దారుణమని మండిపడ్డారు.