శ్రీవారి సేవకు వినియోగించే పుష్పాలు, పత్రాలకు సంబంధించి ప్రత్యేకంగా పార్కులు
- తిరుమల వెంకన్న సేవలో పలు రకాల పుష్పాలు, పత్రాల వినియోగం
- ఆయా మొక్కలతో పార్కులు ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయం
- తిరుమల కొండపై పలు ప్రాంతాల్లో మొక్కలు నాటిన వైవీ
కాగా, శ్రీవారి సేవలో ఉపయోగించే పత్రాలు, పుష్పాలకు సంబంధించిన మొక్కలతో తిరుమలలోనే పార్కులు ఏర్పాటు చేయాలని టీటీడీ సంకల్పించింది. ఈ కార్యక్రమంలో భాగంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో శిలాతోరణం, గోగర్భం డ్యామ్ ప్రాంతాల్లో పలు రకాల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డితో పాటు టీటీడీ అధికారులు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను వైవీ సుబ్బారెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు.