మమతకు మరో ఎదురుదెబ్బ.. పదవికి రాజీనామా చేసిన మరో మంత్రి
- వరుసపెట్టి పార్టీని వీడుతున్న టీఎంసీ నేతలు
- ఎన్నికలకు ముందు మమతకు వరుస ఎదురుదెబ్బలు
- త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న లక్ష్మీరతన్ శుక్లా?
రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నానని, అందుకే రాజీనామా చేసినట్టు లేఖలో పేర్కొన్నారు. అయితే, ఆయన త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఎంపీలుగా ఉన్న సువేందు అధికారి తండ్రి శిశిర్, మరో సోదరుడు దివ్యేందు కూడా త్వరలోనే బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడడం తృణమూల్‌కు పెద్ద దెబ్బేనని అంటున్నారు.