కేసీఆర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు
- జీహెచ్ఎంసీ కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్
- తాము కార్పొరేటర్లుగా గెలిచి రోజులు గడుస్తున్నా తమకు విలువ లేదని మండిపాటు
- పాత కార్పొరేటర్లే ఆధిపత్యం చలాయిస్తున్నారని ఆగ్రహం
ఎన్నికల్లో గెలిచినప్పటికీ తమ ప్రాంతాల్లో తాము ఇప్పటికీ ఏ పనులూ చేయలేకపోతున్నామని వారు మండిపడ్డారు. పాత కార్పొరేటర్లే ఇప్పటికీ ఆధిపత్యం చలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న తమకు ఏ మాత్రం విలువ లేకుండా ఉందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్పొరేటర్లు ప్రగతి భవన్ ను ముట్టడించిన సందర్భంగా అక్కడ పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.