బొమ్మ తలలు పగలగొడితే ఇంత రాజకీయం చేస్తారా?: సీపీఐ నారాయణ
- ఏపీలో ఇప్పటిదాకా మత రాజకీయాలు లేవన్న నారాయణ
- మత రాజకీయాలు రాష్ట్రానికి తీసుకురావొద్దని హితవు
- రైతులు మరణిస్తే పట్టించుకోరా అంటూ ఆగ్రహం
- ఓట్ల రాజకీయం పేటెంట్ హక్కులు బీజేపీవేనని వ్యాఖ్యలు
బొమ్మల తలలు పగలగొడితే ఇంత రాజకీయం చేస్తారా?... కానీ రైతులు మరణిస్తే పట్టించుకోరా? మీకు అసలు సిగ్గుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్, చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి రైతులను ఎందుకు పరామర్శించరు? అని నారాయణ నిలదీశారు. రైతుల ఆందోళనలను పక్కదారి పట్టించేందుకే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇలాంటి మత సమస్యలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు.