తిరుమలలో దర్శనానికి నేటి నుంచి సర్వ దర్శన టోకెన్లు!

Sarva Darshan Tokens in Tirumala
  • గత నెలలో నిలిపివేసిన దర్శనాలు
  • నేటి నుంచి తిరిగి మొదలు
  • విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో జారీ
గత నెల 25న నిలిపివేసిన తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ తిరిగి ప్రారంభించింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సాధారణ దర్శనాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆపై వైకుంఠ దర్శనాల తరువాత, 4వ తేదీ నుంచి సర్వదర్శనం టోకెన్లను ఈ తెల్లవారుజామునుంచి అధికారులుజారీ చేస్తున్నారు.

తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే విష్ణు నివాసంతో పాటు భూ దేవి కాంప్లెక్స్ లో టోకెన్ల జారీ ప్రారంభం అయింది. టికెట్లను పొందేందుకు వచ్చే భక్తులు కరోనా నిబంధనలను పాటించాలని, మాస్క్ ధరించి రావాలని, చేతులను శానిటైజ్ చేసుకుంటూ భౌతిక దూరం పాటించాలని అధికారులు కోరారు.
Go Back to Shorts
Tirumala
Tirupati
TTD
Tokens
Sarva Darshan

More Telugu News