Budda Venkanna: మా నాయకుడు మగాడిలా సవాల్ విసిరాడు... స్వీకరించే దమ్ము జగన్ కుందా?: బుద్ధా

Budda challenges YCP top brass
షార్ట్స్‌లో చూడండి
తనపై వైసీపీ నేతలు దొంగ ఆరోపణలు చేస్తున్నారని, సీఎం జగన్ సింహాచలం అప్పన్న సన్నిధికి వచ్చి ప్రమాణం చేయగలరా? అని నారా లోకేశ్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. తమ నాయకుడు నారా లోకేశ్ దమ్మున్న మగాడిలా సవాల్ విసిరాడని తెలిపారు. ఈ సవాల్ స్వీకరించే దమ్ము వైఎస్ జగన్ కి ఉందా? అని ప్రశ్నించారు. లోకేశ్ పై చేస్తున్న ఆరోపణలకు ఇక్కడితో అడ్డుకట్ట పడినట్టేనని బుద్ధా అభిప్రాయపడ్డారు. 'కాస్కో విజయసాయిరెడ్డీ!' అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు బుద్ధా తమ అగ్రనేత నారా లోకేశ్ చేసిన ట్వీట్ ను కూడా పంచుకున్నారు.
Go Back to Shorts
Budda Venkanna
Jagan
Nara Lokesh
Challenge
Vijay Sai Reddy
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News