తిరుమలలో ఉత్సాహంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన భక్తులు!
- కొండపై మిన్నంటిన గోవింద నామాలు
- దాదాపు 50 వేల మందికి దర్శనం
- ఎస్వీబీసీకి రిలయన్స్ కోటి విరాళం
కొత్త సంవత్సరం సందర్భంగా తిరుమలను విద్యుద్దీప కాంతులతో అలంకరించారు. ఇదిలావుండగా, ఎస్వీబీసీ (శ్రీ వెంకటేశ్వరా భక్తి చానెల్) ట్రస్టుకు రిలయన్స్ సంస్థ రూ.1.01 కోట్ల విరాళాన్ని అందించింది. రిలయన్స్ తరఫున సంస్థ ప్రతినిది శివశంకర్, టీటీడీ ఈఓ ధర్మారెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన డీడీలను అందించారు.