విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలకు అనుమతులు లేవు: పోలీస్ కమిషనర్
- అందరూ ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలి
- రోడ్ల మీద గుమికూడటం, కేకులు కట్ చేయడం చేయరాదు
- వైన్ షాపులు రాత్రి 8 గంటల వరకే ఉంటాయి
రోడ్లపై జనాలు గుమికూడటం, కేకులు కట్ చేయడం వంటి కార్యక్రమాలన్నింటినీ నిషేధించామని పోలీస్ కమిషనర్ చెప్పారు. షాపులు, వ్యాపార సంస్థలకు రాత్రి 10 గంటల వరకే అనుమతి ఉంటుందని తెలిపారు. వైన్ షాపులు రాత్రి 8 గంటల వరకు, బార్ అండ్ రెస్టారెంట్లు రాత్రి 11 గంటల వరకు ఉంటాయని చెప్పారు. ఫంక్షన్ హాల్స్, హోటల్స్ లో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని హెచ్చరించారు. అసాంఘిక, అసభ్యకర కార్యక్రమాలు చేపట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.