అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు

gun fire in usa
  • గాయాలపాలైన ముగ్గురి పరిస్థితి విషమం
  • ఇల్లినాయిస్‌లోని రాక్‌ఫోర్డ్‌లోని డాన్‌ కార్టర్‌ లేన్‌లో ఘటన
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరుపుతూ రెచ్చిపోయాడు. దీంతో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇల్లినాయిస్‌లోని రాక్‌ఫోర్డ్‌లోని డాన్‌ కార్టర్‌ లేన్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు వివరించారు. ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చెప్పారు. అతడు కాల్పులకు ఎందుకు తెగబడ్డాడన్న విషయంపై పోలీసులకు స్పష్టతరాలేదు. అమెరికాలో తుపాకీ సంస్క‌ృతి వల్ల తరుచూ కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
Go Back to Shorts
USA
gun
Crime News

More Telugu News