బాచుపల్లిలో హిజ్రాల హల్‌చల్.. ఇంటి యజమానితో అసభ్యంగా ప్రవర్తించి రూ. 16,500తో పరార్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాచుపల్లిలో హిజ్రాల హల్‌చల్.. ఇంటి యజమానితో అసభ్యంగా ప్రవర్తించి రూ. 16,500తో పరార్

Hijras arrested and Batchupally for misbehavior
  • వ్రతం జరుగుతున్న ఇంట్లోకి ప్రవేశించిన హిజ్రాలు
  • రూ. 20 వేలు ఇవ్వాలని డిమాండ్
  • నిరాకరించినందుకు అర్ధనగ్న ప్రదర్శన
  • అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్‌ శివారులోని బాచుపల్లిలో హిజ్రాలు చెలరేగిపోయారు. ఓ ఇంట్లోకి మూకుమ్మడిగా ప్రవేశించి యజమానిని బెదిరించి రూ. 20 వేలు డిమాండ్ చేశారు.  ఇవ్వకపోవడంతో అసభ్యంగా ప్రవర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ప్రగతి నగర్‌లోని ఓ ఇంట్లో నూతన దంపతులతో కుటుంబ సభ్యులు వ్రతం చేయిస్తున్నారు.

విషయం తెలిసి ఇంట్లోకి ప్రవేశించిన పది మంది హిజ్రాలు నానా రభస చేశారు. తమకు రూ. 20 వేలు ఇస్తేనే అక్కడి నుంచి వెళ్తామని డిమాండ్ చేశారు. ఇచ్చేందుకు ఇంటి యజమాని నిరాకరించడంతో అసభ్యంగా ప్రవర్తించారు. అర్ధనగ్న ప్రదర్శన చేశారు. వికృత చేష్టలతో భయపెట్టారు. పెద్దగా అరుస్తూ భయభ్రాంతులకు గురిచేశారు.

వారి అసభ్య చేష్టలకు భరించలేని ఇంటి యజమాని చలపతి చివరికి కూ. 16,500 ఇవ్వడంతో తీసుకుని వెళ్లారు. అనంతరం ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు 10మంది హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు సెల్‌ఫోన్లు, రూ. 16,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.
Batchupally
Hijras
Police
Hyderabad

More Telugu News