అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీలో చేరిన ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు
- వీరిలో ముగ్గురిని నెలకిందే జేడీయూ సస్పెండ్ చేసింది
- బీజేపీకి మిత్రపక్షంగానే ఉంటామన్న జేడీయూ
- స్నేహపూర్వక ప్రతిపక్షంగానే కొనసాగుతామని వ్యాఖ్య
మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు బియురాం వాంఘే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి వైపు నిలిచారని చెప్పారు. ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండు నాయకత్వంపై నమ్మకముంచారని తెలిపారు. ఇంకోవైపు జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి మాట్లాడుతూ, తమ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరినా... తాము ఆ పార్టీకి మద్దతిస్తామని చెప్పారు. బీజేపీతో తాము స్నేహపూర్వక ప్రతిపక్షంగానే కొనసాగుతామని అన్నారు.